ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో జనసేన ఆధ్వర్యం సంక్రాంతి కానుక పంపిణీ

ABN, First Publish Date - 2021-01-13T18:31:48+05:30

సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా  జనసేన  ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. 40 డివిజన్‌లో ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో జనసేన  పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి పోతిన మహేష్ పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు జీవించే పరిస్థితి లేదని..  ఉపాధి కల్పనలో  ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిత్యావసర వస్తువులు ధరలు నింగినంటాయని.. పన్నుల భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారు అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు.


జనసేన అధికార పోతిన మహేష్ మాట్లాడుతూ...  ప్రతినిధి ప్రజలు ఆనందంగా పండుగను జరుపునే పరిస్థితి లేదన్నారు. ఇసుక కొరత, కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరల నియంత్రణలో సర్కార్ విఫలపమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని... సంక్షేమం లేదని, అవినీతి సంపాదన మీద కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అమ్మఒడితోనే ప్రజలు పండుగ చేసుకోవాలా... గతంలో ప్రజలు పండుగ చేసుకోలేదా అని ప్రశ్నించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రూ.1000కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల పాట్లకన్నా... పైసల వసూళ్ళపైనే ఆయనకు ఆరాటం ఉందన్నారు. అటువంటి మంత్రి ప్రజలకు అవసరమా.. జగన్ రెడ్డి బర్తరఫ్ చేయాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-13T18:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising