ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ కొత్త బాస్‌ ఎవరో.. రేసులో ముగ్గురు..!?

ABN, First Publish Date - 2021-11-09T06:47:19+05:30

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చే కొత్త బాస్‌ ఎవరనే చర్చ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విజయవాడ సీపీ రేసులో ముగ్గురు
  • ప్రముఖంగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌, పాలరాజు, కాంతిరాణా పేర్లు
  • నెలాఖరుకు శ్రీనివాసులు ఉద్యోగ విరమణ

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చే కొత్త బాస్‌ ఎవరనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ప్రస్తుత పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇదే సమయంలో వినీత్‌బ్రిజ్‌లాల్‌, జి.పాలరాజు, కాంతిరాణాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఏ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. తొలుత ఈ పోస్టులో డీఐజీ స్థాయి అధికారులను, ఆ తర్వాత అదనపు డీజీ స్థాయి అధికారులను నియమించారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్‌సవాంగ్‌, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు డీజీ హోదా అధికారులు. తర్వాత ఐజీ హోదాలో సంయుక్త కమిషనర్‌గా ఉన్న బత్తిన శ్రీనివాసులును పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. శ్రీనివాసులు ఉద్యోగ విరమణ తర్వాత ఆ స్థానంలో ఏ హోదా అధికారులను నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది.


ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో కాంతిరాణా, పాలరాజు గతంలో విజయవాడ పశ్చిమ మండల ఉపకమిషనర్లుగా పనిచేశారు. కాంతిరాణా డీఐజీ హోదాలో కొన్నాళ్లపాటు సంయుక్త కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత అనంతపురం రేంజ్‌కు బదిలీ అయ్యారు. పాలరాజు మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సాంకేతిక విభాగానికి డీఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో వినీత్‌బ్రిజ్‌లాల్‌ ఐజీ హోదాలో, కాంతిరాణా, పాలరాజు డీఐజీ హోదాలో ఉన్నారు.


ఐజీ హోదా అధికారినే ఇక్కడ నియమించాలని ప్రభుత్వం భావిస్తే, వినీత్‌బ్రిజ్‌లాల్‌కే అవకాశం ఉందని, హోదాతో సంబంధం లేకుండా డీఐజీ స్థాయి వారిని నియమించాలని భావిస్తే పాలరాజు, కాంతిరాణాల్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కవచ్చునని తెలుస్తోంది. వినీత్‌బ్రిజ్‌లాల్‌ను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే ఐజీ పదోన్నతికి దగ్గర్లో ఉన్న కాంతిరాణా, పాలరాజుల్లో ఎవరో ఒకరిని పోలీస్‌ కమిషనర్‌ పోస్టు వరించవచ్చు.

Updated Date - 2021-11-09T06:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising