ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ వ్యాప్తంగా కదం తొక్కిన కాంట్రాక్టర్లు

ABN, First Publish Date - 2021-10-08T16:46:01+05:30

చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు కదం తొక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు కదం తొక్కారు. ధర్నా చౌక్‌లో అర్ధ నగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ  కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. నాడు పోషకులం.. నేడు యాచకులం అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేము ఉంటాము మీ వెంటే.. మేము మిగిలి ఉంటే’’ అంటూ జగన్‌కు వేడుకోలు తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ... ఆస్తలు మొత్తం పోయి.. అప్పులు మాత్రమే మిగిలాయన్నారు. తమ బిల్లులు చెల్లించండి.. తమ ప్రాణాలు కాపాడండి అని కోరుతున్నామన్నారు. పనుల తాలూకా పెండింగ్‌లో బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పేమెంట్స్ చెల్లించలేని పనులను రద్దు చేసి డిపాజిట్‌లు వెనక్కి ఇవ్వాలన్నారు. నిధులు, నిర్మాణ స్థలం, డ్రాయింగ్ అఫ్రూవల్స్ లేకుండా టెండర్లు పిలవద్దని తెలిపారు. నవరత్నాలు తరహాలో కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు రాక ఒత్తిడి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, కాంట్రాక్టర్‌ల వేదన వినేందుకు సీఎం జగన్ సమయం ఇవ్వాలని కాంట్రాక్టర్లు కోరారు. 

Updated Date - 2021-10-08T16:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising