ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువైద్యుల ఖాళీలను భర్తీ చేయండి

ABN, First Publish Date - 2021-10-29T06:35:59+05:30

నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌(ఎన్‌సీఏ) నిబంధనల ప్రకారం పశువైద్యులను నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ వెటర్నరీ స్టూడెంట్స్‌ అండ్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం 

కళాశాల వద్ద నల్లబ్యాడ్జీలతో విద్యార్థుల నిరసన 

గన్నవరం, అక్టోబరు 28: నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌(ఎన్‌సీఏ) నిబంధనల ప్రకారం పశువైద్యులను నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ వెటర్నరీ స్టూడెంట్స్‌ అండ్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసిం ది. రాష్ట్రంలో జరుగుతున్న పశువైద్య ప్రమాణాల ఉల్లంఘనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వెటర్నరీ బ్లాక్‌డేకి ఇచ్చిన పిలుపు మేరకు గన్నవరం డాక్టర్‌ ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల విద్యార్థులు ప్రధాన ద్వారం వద్ద గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌సీఏ నిబంధనల ప్రకారం 5వేల లైవ్‌ స్టాక్‌ యూనిట్లకుగాను ఒక పశువైద్యుడిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 191.94 లక్షల లైవ్‌స్టాక్‌ యూనిట్లు పశుసంపద ఉంటే 3839 మంది పశువైద్యులకు కేవలం 1558 మంది మాత్ర మే అందుబాటులో ఉన్నారు. ఇంకా 2251 పశువైద్యుల కొరత ఉంది. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు విముఖత చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 1984 నిబంధనల ప్రకారం పశువైద్యుడు లేకుండా పశువైద్యశాలలు, కేంద్రాలను నిర్వహించకూడదని చెబుతున్న 1200 పైచిలుకుగా పశువైద్యులు లేకుండా కాం పౌండర్‌ స్థాయి ఉద్యోగులతో నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యలకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. వివేకనందరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, జశ్వంత్‌, పద్మిని, షర్మిళ, వసుధ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising