ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పనిసరిగా పరిష్కరిస్తాం.. YS Jaganకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ..

ABN, First Publish Date - 2021-11-15T00:24:18+05:30

తప్పనిసరిగా పరిష్కరిస్తాం.. YS Jaganకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : తిరుపతిలోని తాజ్‌ హోటల్‌ వేదికగా జరుగుతున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని ఈ సభాముఖంగా అమిత్‌ షా హామీ ఇచ్చారు.


జగన్ ప్రస్తావించిన అంశాలేంటి..!?

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవణలు చేయాలి అని సమావేశంలో కీలక అంశాలను జగన్‌ ప్రస్తావించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ పై విధంగా హామీ ఇచ్చారు.



Updated Date - 2021-11-15T00:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising