ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు చంద్రబాబు రోడ్‌ షో

ABN, First Publish Date - 2021-03-07T06:39:30+05:30

నేడు చంద్రబాబు రోడ్‌ షో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం విజయవాడలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన రోడ్‌ షోను ప్రారంభించి నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ప్రచారం చేస్తారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలుత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షాహిద్‌ దర్గా వద్ద నుంచి చంద్రబాబు రోడ్‌ షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి స్వాతి సెంటర్‌, కుమ్మరిపాలెం సెంటర్‌, నాలుగు స్తంభాల సెంటర్‌, సితార సర్కిల్‌, సొరంగం రోడ్డు, చిట్టినగర్‌ సెంటర్‌, కేబీఎన్‌ కాలేజీ రోడ్డు, నెహ్రూచౌక్‌, పంజా సెంటర్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, లోబ్రిడ్జి, రైల్వేస్టేషన్‌, ఆంధ్రప్రభ మీదుగా సెంట్రల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో పండ్ల మార్కెట్‌ సెంటర్‌, ఎర్రకట్ట, పాత రాజరాజేశ్వరిపేట, కొత్తరాజరాజేశ్వరిపేట, సింగ్‌నగర్‌ పెట్రోల్‌ బంక్‌, పైపులరోడ్డు, నున్న పోలీస్‌స్టేషన్‌, ప్రకాశ్‌నగర్‌ (మెయిన్‌ రోడ్డు) వరకు వెళ్లి.. అక్కడి నుంచి సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌, అల్లూరి విగ్రహం, గవర్నమెంట్‌ప్రెస్‌, బీఆర్టీఎస్‌ రోడ్డు, మోడరన్‌ సూపర్‌ మార్కెట్‌, చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్‌, మెట్రో, సిద్ధార్థ కాలేజీ మీదుగా తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అమ్మ కల్యాణ మండపం, రమేశ్‌ హాస్పిటల్‌, గురునానక్‌ కాలనీ రోడ్డు, పటమట రైతుబజార్‌ రోడ్డు, ఆటోనగర్‌ గేట్‌ వద్ద నుంచి యూ టర్న్‌ తీసుకుని ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంజిసర్కిల్‌, స్కూృబ్రిడ్జి, ఫీడర్‌ రోడ్డు, బాలాజీనగర్‌, రాణిగారితోట, ‘ఎం’ హోటల్‌, కృష్ణలంకలోని సత్యంగారి హోటల్‌ వరకు రోడ్‌ షో కొనసాగుతుంది. 

Updated Date - 2021-03-07T06:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising