ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడిలో మూడు సింహాల ముడి వీడినట్టే..!

ABN, First Publish Date - 2021-01-21T07:07:14+05:30

కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!

ప్రధాన నిందితుడు పాత నేరస్థుడు? 

రహస్య ప్రదేశంలో విచారణ


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల మాయం కేసు కొలిక్కి వచ్చిందా? పోలీసులు కేసును ఛేదించారా? సింహాల విగ్రహాలను నామరూపాలు లేకుండా చేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసులు మాత్రం ఈ ప్రశ్నలకు కాదనే సమాధానం ఇస్తున్నారు. 


ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి ఉన్న నాలుగు వెండి సింహాల విగ్రహాల్లో మూడు గడచిన ఏడాది సెప్టెంబరు నెలలో కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని దుర్గగుడి అధికారులు భావించినప్పటికీ, మీడియాలో రచ్చ కావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రత్యేకంగా మూడు బృందాలను నియమించారు. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులనూ విచారించారు. అయినా ఫలితం కనిపించలేదు. నాలుగు నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే యువకుడితోపాటు మరో బంగారం షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.


బాలకృష్ణ.. దేవాలయాల్లో చోరీలు చేయడంలో దిట్ట. అతడు విజయవాడ వచ్చినప్పుడు ఈ వెండి విగ్రహాలపై కన్నేశాడు. ఆ తరువాత వాటిని మాయం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా తుని తీసుకెళ్లి, అక్కడ ఓ జువెలరీ యజమానికి విక్రయించినట్టు సమాచారం. ఆ యజమాని వాటిని వెంటనే కరిగించేశాడు. ఓ చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు విచారించగా, మూడు సింహాల కోణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి పోలీసులు ఇక్కడ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి సమాచారం ఇచ్చారు. విజయవాడ నుంచి ఒక ప్రత్యేక బృందం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లి ప్రధాన నిందితుడితోపాటు తునిలో ఉన్న జువెలరీ వ్యాపారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. కేసు చాలా వరకు కొలిక్కి వచ్చిందని, రెండు మూడు రోజుల్లో వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఇంద్రకీలాద్రి  వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-01-21T07:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising