ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీగా తొలగించాలి

ABN, First Publish Date - 2021-08-02T06:27:52+05:30

తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీగా తొలగించాలి

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఐఎ్‌ఫటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఆగస్టు 1: దళితులకు శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తుల్ని ఎమ్మె ల్సీ పదవి నుంచి తొలగించాలని భారత కార్మిక సం ఘాల సమాఖ్య (ఐఎ్‌ఫటీయూ), పీడీఎ్‌సయూ నేత లు డిమాండ్‌ చేశారు. ఆదివారం తుమ్మలపల్లి కళా క్షేత్రం సమీపంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశా రు. పాతికేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెంలో దళితులకు శిరోముండనం చేయించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులను ఎమ్మెల్సీగా చేయడం దళితులను వైసీపీ ప్రభు త్వం అవమానించడమేనని ఐఎ్‌ఫటీయూ నగర ప్రధాన కార్యదర్శి పి.ప్రసాదరావు అన్నారు. దళితులపై దాడులు చేసేవారిని సీఎం కాపాడుతున్నాడని దుయ్యబట్టారు. పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, పీహెచ్‌డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.పద్మ మాట్లాడుతూ ప్రైవేటీరణ ద్వారా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లకు భద్రత లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కారంచేడు, చుండూరు మారణకాండల నేపథ్యంలో జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండలకు వ్యతిరేకంగా ఐఎ్‌ఫటీయూ ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఐఎ్‌ఫటీయూ నగర అధ్యక్షుడు మునిశంకర్‌, సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు, పీవోడబ్ల్యూ నగర అధ్యక్షురాలు కె.దుర్గ, పీడీఎ్‌సయూ నగర అధ్యక్షుడు ఐ.రాజేష్‌, నాయకులు సీహెచ్‌ కృష్ణ, జి.గంగాధర్‌, ఎల్‌.లక్ష్మణ్‌ విజయ్‌, సందీప్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T06:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising