ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో సేవల సంఖ్య పెరగాలి

ABN, First Publish Date - 2021-11-26T06:13:20+05:30

సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల సంఖ్య మరింత పెరగాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు.

సిబ్బందికి సూచనలిస్తున్న జేసీ మోహన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిబ్బందికి జేసీ మోహన్‌కుమార్‌ సూచన

జి.కొండూరు : సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల సంఖ్య మరింత పెరగాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లోని సచివాలయాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. జగనన్న సంపూర్ణ భూహక్కు పథకం, ఓటీఎ్‌సకు సంబంధించిన అంశాలను ఆరా తీశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు ఎన్ని రకాల సర్వీసులు అందుతున్నాయో వారికి అవగాహన కల్పించాలన్నారు. అందుకు సంబంధించిన బోర్డులను కార్యాలయంలో ప్రదర్శన చేయాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టి నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని ఉంటే వెంటనే నమోదు చేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఇంతియాజ్‌పాషా, ఈవోపీర్డీ మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-26T06:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising