ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పావలా ఇచ్చి ముప్పావలా లాగుతోంది : గోపు

ABN, First Publish Date - 2021-01-25T06:54:41+05:30

పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకులు ధరలు పెంచి ప్రభుత్వం రూ.584 కోట్లు భారం మోపడం దారుణమని మచిలీపట్నం నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మచిలీపట్నం టౌన్‌  : పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకులు ధరలు పెంచి ప్రభుత్వం రూ.584 కోట్లు భారం మోపడం దారుణమని  మచిలీపట్నం నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.  బందరు పార్లమెంటు నియోజక వర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  గతంలో కిలో పంచదార రూ.20 రూపాయలు ఉండగా ప్రస్తుతం 34 రూపాయలకు పెంచారన్నారు. కందిపప్లు ధర కిలో రూ.20 నుంచి రూ.34లకు పెంచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం 19 నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపతోందని దుయ్య బట్టారు. సంక్షేమం పేరుతో పేదలకు పావలా ఇచ్చి ముప్పా వలా వడ్డిం చడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబతారన్నారు. టీడీపీ నాయకులు బత్తిన దాసు, పివి ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-25T06:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising