ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీఎల్‌ రాజీనామా చేయాలి!

ABN, First Publish Date - 2021-12-18T06:36:51+05:30

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని స్పష్టమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

విద్యాధరపురం, డిసెంబరు 17 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని స్పష్టమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందని నీతి ఆయోగ్‌ చైర్మన్‌ ప్రకటిస్తే జీవీఎల్‌ నరసింహరావుకు ఎందుకంత ఉలుకని ప్రశ్నించారు. ప్రధాని చైర్మన్‌గా ఉన్న నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌తో జీవీఎల్‌ ఏ హోదాతో మాట్లాడారో చెప్పాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టిన జీవీఎల్‌కు ఆ పదవిలో ఉండే అర్హతలేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ, జీవీఎల్‌ వైఖరి చూ స్తుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అనుమానాలున్నాయన్నారు. అందుకే నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రకటనతో ఖంగుతిన్న జీవీఎల్‌ హడావుడిగా ఖండించే ప్ర యత్నాలు చేశారన్నారు. ఒకవైపు బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్రానికి చెం దిన ఎంపీ రాజ్యసభలో నోటీసు ఇస్తుంటే పరిగణనలోకి తీసుకోకుండా జీవీఎల్‌ వైసీపీ నేతలా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వైసీపీ ఎంపీలు జీవీఎల్‌ మా యలో పడకుండా ఉభయసభల్లో హోదాపై గళం విప్పాలన్నారు. లేకపోతే వారం తా చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అవసరమైతే ప్రైవేటు బిల్లు పెట్టాలన్నారు. లేకుంటే రాజీనామాలకు సిద్ధపడాలని సూచించారు. హోదాకోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తే టీడీపీ సైతం తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T06:36:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising