ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష నేతలకు పోలీసులతో బెదిరింపులా?

ABN, First Publish Date - 2021-10-20T06:12:00+05:30

ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు జగన్‌ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ను వాడుకుంటోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర విమర్శ

విద్యాధరపురం, అక్టోబరు 19 : ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు జగన్‌ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ను వాడుకుంటోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్‌ విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమాలపై మాజీ మంత్రి నక్కా అనందబాబు విలేకరు ల సమావేశంలో మాట్లాడినందుకు గంజాయి సమాచారం తమకు తెలపాలని నర్సీపట్నం పోలీసులు వచ్చి అడగడం దారుణమన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకు కడప, పులివెందుల నుంచి రౌడీలను, గూండాలను తీసుకొచ్చేవారని, ఇప్పుడు జగన్‌ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నాడని విమర్శించారు, అన్ని శాఖలకు తానే షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలకనుగుణంగానే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నపుడు తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణలో కేసు పెట్టిన విషయాన్ని ఏపీ పోలీసులు మరచిపోకూడదన్నారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే 10 నిమిషాల్లో పోలీసులు వాలిపోతున్నారన్నారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసుల బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. పార్టీలు అధికారంలో ఐదేళ్లు మాత్రమే ఉంటాయని, ప్రభుత్వ ఉ ద్యోగులు 3 దశాబ్దాలకు పైగా పనిచేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాడేపల్లి రాజప్రాసాదం, స జ్జల ఆదేశాలను పాటిస్తే చులకనవుతారన్నారు. నోటీసులిచ్చినంత మాత్రాన ఎవరూ భయపడరన్నారు. 

Updated Date - 2021-10-20T06:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising