ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక సదుపాయాలు పట్టని వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-07-25T07:03:38+05:30

వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతులను గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే జమ యంగళ వెంకటరమణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

రామవరం వద్ద రహదారిపై గోతుల్లో చేప పిల్లలను వదులుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ ఆధ్వర్యంలో నిరసన 

కైకలూరు : వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతులను గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే జమ యంగళ వెంకటరమణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. మండలంలోని రామవరంలో ఆర్‌ అండ్‌ బీ రహదారి, ఆటపాక, అగ్రహారం, మండవల్లిలో జాతీయ రహదారిల్లో గోతుల్లో శనివారం చేప పిల్లలను వదిలి టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.   వైసీపీ ప్రభుత్వం  రహదారుల నిర్మాణంలో  పూర్తిగా వైఫల్యం చెం దిందన్నారు.  కనీసం మరమ్మతులు చేయకపోవడం దారుణమన్నారు.   కైకలూరు టీడీపీ అధ్యక్షుడు పెనుమత్స త్రినాఽథరాజు, నారగాని వీర వెంకట నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మీ, పార్లమెంట్‌ కమిటీ సభ్యులు పోలవరపు లక్ష్మీరాణి, తెలుగుయువత నాయకులు పూల రామచంద్రరావు, దావు నాగరాజు, టీడీపీ  నాయకులు పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి, పళ్లెం ఏడుకొండలు, ముళ్లపూడి  సత్తిబాబు, నున్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

  తెలుగు యువత ఆధ్వర్యంలో..

తోట్లవల్లూరు  : వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి అభివృద్ధిని గాలికి వదిలేసిందని, రహదారులకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా ప్రజలకు నరకం చూపిస్తోందని తెలుగు యువత నాయకుడు వల్లూరు కిరణ్‌ విమర్శించారు. తోట్లవల్లూరు మండలం పెనమకూరు - చాగంటిపాడు రోడ్డులో భారీ గోతులు ఏర్పడడంతో  శనివారం కిరణ్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నాగరాజు, శ్రీనాధ్‌, రాఘవులు, జైకృష్ణ, మనోజ్‌, తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని నినాదాలు చేశారు.  ప్రభుత్వం కళ్లు తెరిచి రహదారులను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-07-25T07:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising