ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రాహ్మణుల కోపాగ్ని జ్వాలల్లో మాడిపోకముందే...: టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-05-13T18:34:43+05:30

కరోనా రెండోదశలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా ముఖ్యమంత్రి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షఉలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్‌ సూర్య మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా రెండోదశలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా ముఖ్యమంత్రి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షఉలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్‌ సూర్య మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులు హలో లక్ష్మణా అని విలపిస్తున్నారని అన్నారు. చనిపోయిన బ్రాహ్మణుల అంత్యక్రియల నిమిత్తం  చంద్రబాబు ప్రభుత్వం రూ.10వేలు అందించేదని... ఈ ముఖ్యమంత్రి ఆ పథకాన్ని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రతి జిల్లాలో దాదాపు 2 నుంచి 3 వందల మంది బ్రాహ్మణులు చనిపోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ఈ ముఖ్యమంత్రి, మల్లాది విష్ణు, కోనరఘుపతి ఏం సాయం చేశారని ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని అనేక బ్రాహ్మణ కుటుంబాలు కడుపుమంటతో విలపిస్తున్నాయన్నారు. బ్రాహ్మణుల కోపాగ్ని జ్వాలల్లో మాడిపోకముందే, జగన్మోహన్ రెడ్డి మేల్కోవాలని ఆనంద్ సూర్య హెచ్చరించారు. 

Updated Date - 2021-05-13T18:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising