ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారం శాశ్వతం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి: prathipati

ABN, First Publish Date - 2021-10-21T17:29:44+05:30

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు, జగన్ రెడ్డి ఆటవిక పాలనపై చంద్రబాబు పోరు ప్రజల కోసమే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు, జగన్ రెడ్డి ఆటవిక పాలనపై చంద్రబాబు పోరు ప్రజల కోసమే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంపై ఎప్పుడైనా దాడులు జరిగాయా అని నిలదీశారు. ప్రజల మెప్పు పొందడం చేతగాక జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయన హితవుపలికారు. జగన్ రెడ్డికి ఓటేసిన వారు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అంతా నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు.


కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు  ఉంటే ఏపీ నెం.1 స్థానంలో ఉండేదని తెలిపారు. జగన్ అలివి కాని హామీలు ఇచ్చారని తెలిపారు. టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను రద్దు చేశారని... రైతు రుణమాఫీ రద్దు చేశారన్నారు. డీజీపీ నిస్సహాయ స్థితిలో ఉన్నారని... ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఉందని తెలిపారు.  ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. పోలీసుల పనితీరు సిగ్గుపడే విధంగా ఉందని.... రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. హెరాయిన్, గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా ఏపీ మారిందన్నారు. ఏపీలో ఉన్న చవకబారు మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా లేవని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-21T17:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising