ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకూడదా?: Pitani
ABN, First Publish Date - 2021-10-21T17:23:35+05:30
ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిరంకుశ పాలన, అమానవీయ దాడులు, అప్రజాస్వామిక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు దీక్ష చేపట్టామని టీడీపీ నేత పితాని సత్యనారాయణ అన్నారు.
అమరావతి: ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిరంకుశ పాలన, అమానవీయ దాడులు, అప్రజాస్వామిక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు దీక్ష చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్టీ దేవాలయం, టీడీపీ ప్రధాన కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో పాలన సాగడం లేదన్నారు. చంద్రబాబు గురించి మంత్రులు ఎన్ని బూతులు మాట్లాడారో జగన్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. సజ్జల డైరెక్షన్‌లో మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును బూతులు తిడుతున్నారని... ఈ రోజు వైసీపీకి చట్టం గుర్తొచ్చిందా అని పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-10-21T17:23:35+05:30 IST