ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ విధించాలి: పిల్లి మాణిక్యరావు

ABN, First Publish Date - 2021-10-07T19:50:01+05:30

ప్రజలు దోమల బారినపడి, డెంగ్యూ మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతున్నా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజలు దోమల బారినపడి, డెంగ్యూ మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతున్నా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని మంత్రి బుగ్గన గతంలో అవహేళనచేశారన్నారు. దోమల దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే, మంత్రులు ప్రజలతో కలిసి రోడ్లపై తిరగాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి, మంత్రులకు డబ్బు సంపాదనపై ఉన్నశ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. దోమలు రక్తాన్ని పీల్చిబతికితే, మంత్రులు ప్రజలను అన్నిరకాలా పీల్చిపిప్పిచేసి బతికేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ విధించాలని... వైద్య సిబ్బంది గ్రామాల్లో పాగావేసి, ప్రజలను కాపాడాలని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో పూర్తి వివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-07T19:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising