ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనాతో వందల మంది చనిపోతుంటే...వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం’

ABN, First Publish Date - 2021-05-11T18:55:19+05:30

రాష్ట్రంలో కరోనా పరిస్థితిని పట్టించుకోకుండా వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితిని పట్టించుకోకుండా వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘బెడ్లు దొరక్క బయట, బెడ్లు దొరికి ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారు. ఇవేమీ పట్టని వైకాపా ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు. కరోనా బారిన పడి వందల మంది చనిపోతుంటే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణం. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి రుయాకి 60 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేసారు. ప్రభుత్వానికి, వైకాపా నాయకులకి ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో గుర్రం మీద ఉరేగుతున్న నేతలు ఒక ఉదాహరణ’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-05-11T18:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising