ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూతుల భాషను మొదలుపెట్టింది వారు కాదా?: Nakka anand

ABN, First Publish Date - 2021-10-21T17:42:41+05:30

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రతిరోజూ అవమానాల పాలవుతోందని టీడీపీ నేత నక్కా ఆనంద బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రతిరోజూ అవమానాల పాలవుతోందని టీడీపీ నేత నక్కా ఆనంద బాబు అన్నారు. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యాన్ని రాష్ట్రంలో కోల్పేయే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిట్టనిలువునా దగా అవుతోందన్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలనను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బూతుల భాషను మొదలుపెట్టింది వైసీపీ నేతలు, మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ఏపీ గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. ఎక్కడ గంజాయి పట్టుకున్నా మూలాలు ఇక్కడే ఉన్నాయని... ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులే చెప్పారని ఆయన తెలిపారు.


గుజరాత్ ముంద్రా పోర్ట్ నుంచి హెరాయిన్ ఏపీకి వచ్చిందన్నారు. పోలీసులు, ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంటిపై దారుణంగా దాడి చేశారన్నారు. తన అభిమానులే దాడులు చేశారంటూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పదవి రాజ్యాంగబద్ధ పదవి కాదా అని నిలదీశారు. గౌతమ్ సవాంగ్ డీజీపీగా పనిచేస్తున్నారా లేక, వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లా పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లకు వైసీపీ రంగులు వేసుకోవాలని.... ఇదే పరిస్థితి ఉంటే సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగే దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-21T17:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising