ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుళ్ల‌కి తీర‌ని అప‌చారం త‌ల‌పెట్టారు: లోకేష్

ABN, First Publish Date - 2021-10-24T19:18:30+05:30

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల‌ ఆరాధ్యదైవం పాత‌ప‌ట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహ‌ద్వారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల‌ ఆరాధ్యదైవం పాత‌ప‌ట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌డం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ధ్వంసం, ఒక‌టేమిటి రెండున్న‌రేళ్ల జగన్ పాల‌న‌లో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల‌కి తీర‌ని అప‌చారం త‌ల‌పెట్టారన్నారు. రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల పేరుతో అదే పాత‌ప‌ట్నంలో ఆంజ‌నేయ‌స్వామి, వినాయ‌కగుడిలో విగ్ర‌హాలు త‌ర‌లించుకుంటామ‌ని వేడుకున్నా స‌మ‌యం ఇవ్వ‌కుండా బుల్డోజ‌ర్ల‌తో కూల్చేయ‌డం ప్ర‌భుత్వ పెద్ద‌లు హిందువుల ఆల‌యాల ప‌ట్ల ఎంత నిర్ద‌య‌గా ఉన్నారో అర్థం అవుతోందని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేకు ఆల‌యాల ధ్వంసం స‌మాచారం ఇచ్చినా, ప‌ట్టించుకోలేద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారంటే... ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసి చేసిన విధ్వంస‌మే అని లోకేష్ ఆరోపించారు. 

Updated Date - 2021-10-24T19:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising