ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పు: Kala venkat rao

ABN, First Publish Date - 2021-11-12T19:09:31+05:30

పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పు ఉంటుందని అని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పు ఉంటుందని అని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లు అని... ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం పడుతోందని తెలిపారు. జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. జగన్ రెడ్డి దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పు పడుతోందని తెలిపారు. అవినీతి, దుబారా కోసం ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో ప్రజానీకంపై మోయలేని భారం పడుతోందని చెప్పారు. చంద్రబాబు శిశువు జన్మించినప్పటి నుంచి వారి బాగోగుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు తాగే టీ కి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు.  చంద్రబాబు పాలనలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ రెడ్డి పాలనలో రూ.5000లకు పెరిగిందన్నారు. మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ముడుపులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. 6 సార్లు పెంచారని కళా వెంకట్రావు అన్నారు. 

Updated Date - 2021-11-12T19:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising