ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేకమైన పరిస్థితుల్లో దీక్ష చేస్తున్నాం: chandrababu

ABN, First Publish Date - 2021-10-21T15:52:39+05:30

ఎన్టీఆర్ భవన్ లో 36గంటల నిరసన దీక్ష చేస్తున్నామని... ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్టీఆర్ భవన్ లో 36గంటల నిరసన దీక్ష చేస్తున్నామని... ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో దాడి జరిగింది కాబట్టే ఇక్కడే దీక్షకు కూర్చున్నామని తెలిపారు. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం ఇది అని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాల్ని యత్నించారని ఆయన అన్నారు. చిన్న పిల్ల మనోభావాలు లెక్క చేయకుండా పట్టాభి ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు.


పార్టీ కార్యాలయంపై దాడి జరగబోతోందని మంగళవారం సాయంత్రం 05:03కి డీజీపీకి ఫోన్ చేస్తే సందించలేదని తెలిపారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులకు యత్నించినా స్పందన లేదన్నారు. దీంతో వెంటనే గవర్నర్‌కు ఫోన్ చేస్తే ఆయన స్పందించారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పామన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అమీత్‌షాను కోరామని అన్నారు. ఇది ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని తెలిపారు. తనకేమైనా పర్లేదనే వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు. 

Updated Date - 2021-10-21T15:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising