ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి‌‌ వచ్చి 28నెలలు అయినా ఇళ్ల ఊసే లేదు: బోండా ఉమ

ABN, First Publish Date - 2021-07-17T17:30:34+05:30

ఎన్నికల సమయంలో పేదలు అందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్నారని... అధికారంలోకి‌‌ వచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  ఎన్నికల సమయంలో పేదలు అందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్నారని... అధికారంలోకి‌‌ వచ్చి 28నెలలు అయినా ఇళ్లు ఊసే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. శనివారం పేదలందరకీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మాణం‌ చేయాలంటూ టీడీపీ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ  కొండల్లో, గుట్టల్లో సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. నివాస యోగ్యత లేని స్థలంలో పునాదుల కోసం లక్ష రూపాయలు కట్టమని చెబుతున్నారని... పేదలు ఏ విధంగా అంత డబ్బులు తెస్తారో పాలకులే చెప్పాలని ప్రశ్నించారు.


ముప్పై లక్షల ఇళ్లు ఇస్తామని పేదలను ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. డబ్బు లేదన్న‌వారి స్థలాలు రద్దు చేసామని బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్‌ల ద్వారా పేదలపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు కూడా పూర్తి చేయలేదని తెలిపారు. పనులు నిలిపివేయడంతో ఆ ఇళ్లు‌ వృధాగా పడి ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పేదలందరకీ ఇళ్లు కట్టించి ఇవ్వాలి అని బోండా ఉమ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-17T17:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising