ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయంత్రంలోపు చవితి వేడుకలకు అనుమతివ్వాలి: Bonda uma

ABN, First Publish Date - 2021-09-08T16:55:28+05:30

వినాయక చవితి ఉత్సవాలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక తుగ్లక్ చర్య అని టీడీపీ నేత బోండా ఉమ దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక తుగ్లక్ చర్య అని టీడీపీ నేత బోండా ఉమ దుయ్యబట్టారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వేల సంవత్సరాల నుంచి భారత దేశానికి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వినాయక చవితిని రద్దు చేశారని మండిపడ్డారు. ఇది రద్దుల, బ్యాన్‌ల ప్రభుత్వంలా మారిందన్నారు. పార్టీ కార్యక్రమాలకు, వైఎస్ వర్ధంతి వేడుకలకు కోవిడ్ అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. అందుకే దీనిపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ కూడా రాశామన్నారు. వినాయక చవితిని ప్రజలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మేల్కొని ఈరోజు సాయంత్రం లోపు చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-08T16:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising