ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు కేసులు...ఆరు అరెస్టుల్లా జగన్ పాలన: ఆలపాటి

ABN, First Publish Date - 2021-04-23T18:29:31+05:30

జగన్ రెడ్డి రెండేళ్ల పాలన మూడు కేసులు, ఆరు అరెస్టులుగా ఉందని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ రెడ్డి రెండేళ్ల పాలన మూడు కేసులు, ఆరు అరెస్టులుగా ఉందని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పాలించడం చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే పాలన ఇలానే ఉంటుందన్నారు.  సమస్యలను ప్రశ్నించిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు, కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఒక బందిపోటును అరెస్ట్ చేసినట్లుగా వందల మంది పోలీసులతో నరేంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. వేధించి కోడెల శివప్రసాద్‌ను బలిగొన్నారని... అలానే అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, దేవినేని ఉమా, దూళ్లిపాళ్ల నరేంద్రలపై కుట్ర పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి 11 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైల్లో పెట్టడమే జగన్ రెడ్డి ధ్యేయమా? అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-23T18:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising