ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్, ప్రశాంత్ వికృత క్రీడకు పెయిడ్ ఆర్టిస్ట్‌గా పోసాని: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-09-29T19:17:43+05:30

జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా? అని ప్రశ్నించారు. జుగుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్  కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని నిలదీశారు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారన్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? అని అన్నారు.


2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారిందని... మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ధరలు పెంచడం, దోపిడీ పాల్పడటం వంటి వాటితో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని మర్చిపోకండని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2021-09-29T19:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising