ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-06-11T16:01:04+05:30

అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు నెలకొల్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు నెలకొల్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా ధరలపై గద్ధించి.. నేడు గండుపిల్లిలా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో నత్తనడక..ధరాభారంలో జట్ స్పీడ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ధరాభబారం తాడేపల్లి తాబేదారుకు కనిపించడం లేదా అని నిలదీశారు. వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.6 తగ్గించిందని తెలిపారు. గతంలో చంద్రబాబు వ్యాట్ రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ధరలు పెంచారన్నారు. అదనపు సెస్ రూ.4, రోడ్డు సెస్ పేరుతో రూపాయి అధనపు బాదుడు బాదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాధి రాష్ట్రాల్లో ఏపీ టాప్ ఉందన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే తాడేపల్లి రాజప్రాసాదంలో దరిద్రపు రాజకీయాలా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్ రెడ్డికి లేదని అచ్చెన్నాయుడు అన్నారు. 

Updated Date - 2021-06-11T16:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising