ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-04-22T16:27:36+05:30

కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలిపారు. కరోనా దెబ్బకు స్కూళ్లు మూతపడి ఉపాధ్యాయులు కార్మికులుగా మారారని అన్నారు. అన్నమో రామచంద్రా అంటూ టీచర్లు అలమటిస్తున్నారని వాపోయారు. కరోనా మొదలయ్యాక ఇప్పటి వరకూ  25మంది టీచర్లు మృతి చెందారని...అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని...రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-22T16:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising