ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాము మృతి పార్టీకి తీరని లోటు

ABN, First Publish Date - 2021-05-08T06:06:47+05:30

రాము మృతి పార్టీకి తీరని లోటు

రాము అంతిమయాత్రలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కృష్ణలంక, మే 7 : కృష్ణలంక ప్రాంత టీడీపీ నాయకులు నరహరిశెట్టి రాము మృతి పార్టీకి తీరనిలోటని  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. శుక్రవారం  రాము భౌతికకాయానికి నివాళులర్పించి అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాము నాకు సోదరసమానులని, కృష్ణలంక ప్రాంతంలో టీడీపీ బలోపేతానికి స్వర్గీయ గొరిపర్తి నర్సింహారావుతో కలిసి కృషి చేశారన్నారు. టీడీపీ పార్టీకి రాము చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు గద్దె సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొరిపర్తి నామేశ్వరరావు, కొర్రా అప్పన్న, కేశనం భావన్నారాయణ, రాజనాల బాబ్జి, కోలపల్లి కోటిబాబు, పెద్ది అన్నారావు, ఎం.పీరుబాబు పాల్గొన్నారు. 

 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచాలి

పటమట: సచివాలయాల్లో కరోనా రెండవ డోసు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మొదటి డోసు సచివాలయంలో వేసి రెండవ డోసు పబ్లిక్‌ హెల్త్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారన్నారు. కరోనా నిర్థారణ చేయించుకునే వారు కూడా ఇవే కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుం దన్నారు. దీనివల్ల వ్యాక్సిన్‌ తీసుకునే వారికి కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. రెండవ డోసు సక్రమంగా అందక చాలామంది ఆందోళన చెందుతున్నారని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని గద్దె రామ్మోహన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-08T06:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising