ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడిన సుప్రీం తీర్పు

ABN, First Publish Date - 2021-01-27T06:59:08+05:30

పంచాయతీ ఎన్నికల విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.

బందరులో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న రవీంద్ర, కొనకళ్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జనవరి 26 : పంచాయతీ ఎన్నికల విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.  సుప్రీం తీర్పును హర్షిస్తూ  టీడీపీ నేతలు   లక్ష్మీటాకీసు సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, టీడీపీ నాయకులు ఎండి ఇలియాస్‌ పాషా, పి.వి.ఫణికుమార్‌, యువరాజ్‌, పిప్పళ్ళ కాంతారావు, బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు. పెడన:రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌లోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. యక్కల శ్యామల య్య, వహబ్‌ఖాన్‌, చందన నారాయణరావు, హమీ దుల్లా, బెజవాడ నాగరాజు, అనుముల పూర్ణచం ద్రరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడటౌన్‌ : సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాం టిదని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సుప్రీం తీర్పును హర్షిస్తూ కోతిబొమ్మ సెంటర్‌లో  అంబేద్కర్‌ విగ్రహానికి సోమవారం టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు కంచర్ల సుధాకర్‌, యార్లగడ్డ సుధారాణి, జానీ షరీఫ్‌, ఆకునూరి ఏకాంబరం, సయ్యద్‌ జబిన్‌, దాసు శ్యామ్‌ ప్రసాద్‌, రమేష్‌చౌదరి పాల్గొన్నారు. కైకలూరు: స్ధానిక సంస్ధలు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఔన్నత్యాన్ని  కాపాడిందని మండల టీడీపీ అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు అన్నారు.  సుప్రీం తీర్పును హర్షిస్తూ తాలుకా సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహా నికి పాలాభిషేకం చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొమ్మన బోయిన విజయలక్ష్మీ, పోలవరపు లక్ష్మీరాణి, వేము లపల్లి కారుణ్య, కూరెళ్ళ ఇస్సాక్‌ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising