ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభ్యుదయవాది స్వర్ణలత

ABN, First Publish Date - 2021-04-16T06:39:16+05:30

జీవించినప్పుడు సమాజానికి మేలు చేయటమే కాకుండా తన భౌతికకాయాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరిన అభ్యుదయ వాది దాసరి స్వర్ణలత ఆదర్శనీయురాలని పలువురు వక్తలు నివాళుల ర్పించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి : జీవించినప్పుడు సమాజానికి మేలు చేయటమే కాకుండా తన భౌతికకాయాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరిన అభ్యుదయ వాది దాసరి స్వర్ణలత ఆదర్శనీయురాలని పలువురు వక్తలు నివాళుల ర్పించారు. స్వచ్ఛ చల్లపల్లి రథసారఽథి,  జనవిజ్ఞానవేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ డిఆర్‌కె. ప్రసాద్‌ మాతృ మూర్తి దాసరి స్వర్ణలత బుధవారం సాయంత్రం కన్నుమూశారు.   వైద్యపరిశోధనలకు ఉపయోగపడేలా శరీర దానం చేయాలనీ ముందుగానే కుటుంబ సభ్యులకు  చివరి కోరికను తెలియచేయటంతో  ఆమె భౌతికకాయాన్ని వైద్యకళాశాలకు అప్పగించారు.  అశేష ప్రజల తుది వీడ్కోలు అనంతరం వైద్య కళాశాల ప్రతినిధులు స్వర్ణలత భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. స్వర్ణలత భౌతికకాయానికి ఏఎంసీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, ఉపసర్పంచ్‌ ముమ్మనేని నాని, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ, డాక్టర్‌ భగత్‌సింగ్‌, డాక్టర్‌ ఎం.వరప్రసాద్‌, వివిధ పార్టీల నేతలు మోర్ల రాంబాబు, మోపిదేవి ద్వారకానాఽథ్‌,  బంగారుబాబు, అడ్డాడ ప్రసాద్‌ బాబు, యద్ధనపూడి మధు, వాకా రామచంద్రరావు, జన్ను జగన్‌, నాగళ్ల భీమారావు,  వంగల సుబ్బా రావు, దాసి సీతారామరాజు, తూము వెంకటేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు.  ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఫోన్‌లో డీఆర్కేను పరామర్శించి సానుభూతి  తెలిపారు. 

Updated Date - 2021-04-16T06:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising