ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ఇగ్నో పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-02T06:28:12+05:30

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్‌ 2021 టర్మ్‌ఎండ్‌ పరీక్షలు ఈ నెల 3 నుంచి సెప్టెంబరు 9 వరకు జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఆగస్టు 1 : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్‌ 2021 టర్మ్‌ఎండ్‌ పరీక్షలు ఈ నెల 3 నుంచి సెప్టెంబరు 9 వరకు జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 8 పరీక్షా కేంద్రాలను విజయవాడ, గుంటూరు, నెల్లూరు, సూళ్లూరుపేట, తిరుపతి, కర్నూలు, ఆదోని, అనంతపురంలలో ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ ఎనిమిది పరీక్షా కేంద్రాలలో 6,485 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరికీ హాల్‌టికెట్లు ఇగ్నో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను ఇగ్నో విశ్వవిద్యాలయపు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు ప్రత్యేకంగా హాల్‌ టికెట్స్‌ పంపించినట్టు, అందుకోసం అభ్యర్థులు తమ అధ్యయన కేంద్రాలలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 0866 - 2565253 ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-08-02T06:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising