ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా...?

ABN, First Publish Date - 2021-03-06T06:48:59+05:30

బెదిరింపుల ద్వారా వచ్చిన ఏకగ్రీవాలను చూసి వైసీపీ నాయకులు తమ బలం అని భ్రమ పడుతున్నారని, అది కేవలం వాపు అనేది వారు గుర్తించకపోవడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నాయకులను ఉద్ధేశించి ఎద్దేవా చేశారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి పీతల సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి పీతల సుజాత

నూజివీడు, మార్చి 5: బెదిరింపుల  ద్వారా వచ్చిన ఏకగ్రీవాలను చూసి వైసీపీ నాయకులు తమ బలం అని భ్రమ పడుతున్నారని, అది కేవలం వాపు అనేది వారు గుర్తించకపోవడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నాయకులను ఉద్ధేశించి ఎద్దేవా చేశారు. శుక్రవారం నూజివీడు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులు, దాడులు చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగితే, రాష్ట్ర ప్రజలకు జగన్‌మోహనరెడ్డి తగిన గుణపాఠం చెప్పాడని, మరో మూడేళ్లు వైసీపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను మొత్తం అమ్ముకుని, ప్రైవేటు భూములను కబ్జా చేయడానికి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పని చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో మరోమారు వైసీపీ అధికారంలోకి రాకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుడిలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-06T06:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising