ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక బెడ్‌లను కేటాయించండి

ABN, First Publish Date - 2021-05-06T06:28:15+05:30

ప్రత్యేక బెడ్‌లను కేటాయించండి

డీపీవోకు వినతి పత్రం అందజేస్తున్న పీఆర్‌ కార్యదర్శులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, మే 5 : కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో ముందు వరుసలో ఉంటున్న పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా బెడ్‌లను కేటాయించాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు ఘంటా రామమోహనరావును కోరారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబుకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు కీలకపాత్ర పోషిస్తున్నారని  డీపీవోకు చెప్పారు. కరోనా  ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ బారినపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు పంచాయతీరాజ్‌ ఉద్యోగులు మృతి చెందినట్లు డీపీవోకు తెలిపారు. ఉద్యోగులకు సకాలంలో సరైన వైద్యం అందించలేకపోవడం, వైద్య సౌకర్యం అందు బాటులో లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. డీపీవోను కలసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-05-06T06:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising