ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం క్లాప్ కార్యక్రమం నిర్వహణపై బీజేపీ అభ్యంతరం

ABN, First Publish Date - 2021-10-01T16:30:05+05:30

స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాడుతూ వాహనాలపై సీఎం జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ.1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా తయారు చేయించడానికి నిధులు కూడా లేవని.. ఇవన్నీ కేంద్ర నిధులేనన్నారు. గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో చీవాట్లు తిన్నా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదని, పద్ధతి మార్చుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ ఫొటో లేకుండా వాహనాలు ప్రారంభిస్తారా..? అంటూ ప్రశ్నించారు. వెంటనే మోదీ ఫొటో వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని.. కేవలం తిట్ల దండకంతో సరిపెడుతోందని సోమ వీర్రాజు ఆరోపించారు.

Updated Date - 2021-10-01T16:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising