ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరదాలు తొలగించండి

ABN, First Publish Date - 2021-05-19T06:22:02+05:30

భవన నిర్మాణాల్లో భాగంగా కార్మికులు వాటి చుట్టూ కడుతున్న పరదాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   లేకపోతే విద్యుత్‌ చట్టం కింద కేసులు

  భవన నిర్మాణ కార్మికులకు సీపీడీసీఎల్‌ హెచ్చరిక

విజయవాడ, మే 18(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాల్లో భాగంగా కార్మికులు వాటి చుట్టూ కడుతున్న పరదాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గాలులు బలంగా వీచినప్పుడు చిరిగిపోయి ఆ పరదాలు విద్యుత్‌ లైన్లపై పడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల లైన్లు బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరదాలు కట్టి నెలలు కావడంతో అవి పాడై చిరిగిపోతున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు నిత్యం వాటిని పరిశీలిస్తూ చిరిగిపోతే తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో వారిపై విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 136 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన నష్టపరిహారంతోపాటు విద్యుత్‌ అంతరాయానికి సంబంధించిన నష్టపరిహారాన్ని కార్మికుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ పరదాలు హై టెన్షన్‌ తీగలపై పడడం వల్ల తెగిపోతున్నాయని, హైటెన్షన్‌ తీగలు కాలిపోతున్నాయని వివరించారు.  రెండు, మూడు విద్యుత్‌ ఉపకేంద్రాల్లో బ్రేక్‌డౌన్లు ఏర్పడుతున్నాయన్నారు. కొంతమంది వినియోగదారులు భవనాలపై దుస్తులను ఆరబెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవి ఎగిరి సమీపాన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-19T06:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising