ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ఫీజులు తగ్గించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ABN, First Publish Date - 2021-06-18T06:06:08+05:30

పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుణదల, జూన్‌ 17 :  పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక  నిర్ణయాలను నిరసిస్తూ ఎస్‌ఎ్‌ఫఐ ఆద్వర్యంలో గురువారం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద ధర్నా చేశారు. ఫీజుల విషయంలో విద్యార్ధులను ఇబ్బందిపెడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలులోకి తీసుకొస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేయడం మంచి పరిణామమేనన్నారు. అయితే అదే సమయంలో తెలుగుమీడియం కూడా కొనసాగించాల్సిందేనన్నారు. నగర అధ్యక్షుడు ఏసుబాబు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులపై  ఫీజుల బారాలు మోపడం సరికాదన్నారు. పెంచిన ఫీజులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఎస్‌ఎ్‌ఫఐ నగర కార్యదర్శి రాధా కృష్ణ, బార్గవ్‌, ప్రసాద్‌, ప్రణీత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T06:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising