ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ వలంటీర్లకు సేవా పురస్కారాలు

ABN, First Publish Date - 2021-04-18T05:48:47+05:30

ఉత్తమ వలంటీర్లకు సేవా పురస్కారాలు

వలంటీర్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న సబ్‌కలెక్టర్‌, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు, ఏప్రిల్‌ 17: వలంటీర్ల వ్యవస్థ వల్ల సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని జిల్లా పరిషత్‌ సీఈవో సూర్యప్రకాశరావు అన్నారు. రోటరీ ఆడిటోరియంలో శనివారం నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు సేవా పురస్కారాలను అందించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తోందని సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ట మంగైన్‌ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వలంటీర్లు చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. నియోజకవర్గంలో ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర, 25 మందికి సేవా రత్న, 1,461 మందికి సేవా మిత్ర అవార్డులు, నగదు పురస్కారాన్ని అందిస్తున్నామన్నారు. నూజివీడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్‌ చైర్‌పర్సన్‌ అమిరున్నీసా బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇద్దరు వలంటీర్లకు సేవావజ్ర అవార్డులు

చాట్రాయి: కోటపాడు వలంటీర్‌ కంభంపాటి శ్రీపద్మ, మర్లపాలెం వలంటీర్‌ కుప్పాల వీరనాగరాజు సేవా వజ్ర ఆవార్డులు అందుకున్నారు. రూ.30 వేలు, ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అందజేశారు. ఐదుగురు సేవారత్న, 257 మంది వలంటీర్లు సేవా మిత్ర ఆవార్డులు అందుకున్నారు.



Updated Date - 2021-04-18T05:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising