ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు, కార్మిక శంఖారావ సదస్సును జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2021-04-18T05:46:21+05:30

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు - 2020ను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 19న తలపెట్టిన రైతు, కార్మిక శంఖారావ సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ పశ్చిమ కృష్ణ ప్రధాన కార్యదర్శి ఎన్‌.సీహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న సీఐటీయూ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు, కార్మిక శంఖారావ సదస్సును 

జయప్రదం చేయండి 

మైలవరం (జి.కొండూరు), ఏప్రిల్‌ 17: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు - 2020ను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఈనెల 19న తలపెట్టిన రైతు, కార్మిక శంఖారావ సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ పశ్చిమ కృష్ణ ప్రధాన కార్యదర్శి ఎన్‌.సీహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీలో రైతులు 147 రోజులుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిర్వహిస్తున్న సభకు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాల కార్యదర్శులు చాట్ల సుధాకర్‌, ఎం.మహేష్‌, సీఐటీయూ నాయకులు సాంబయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising