ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీలో.. మరో మోసం!

ABN, First Publish Date - 2021-10-17T06:22:07+05:30

ఉద్యోగం కల్పిస్తామంటూ అందినకాడికి డబ్బులు వసూలు చేసిన మరో ఉదంతం ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగం పేరుతో రూ. 4లక్షలు వసూలు చేసిన రవికాంత్‌! 

టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఉద్యోగం కల్పిస్తామంటూ అందినకాడికి డబ్బులు వసూలు చేసిన మరో ఉదంతం ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో వెలుగుచూసింది. వైఎ్‌సఆర్‌ ఎం ప్లాయీస్‌ ఫెడరేషన్‌లో గతంలో నేతగా కొనసాగుతూ ప్రస్తుతం వైఎ్‌సఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్న విద్యాధరపురం డిపోకు చెందిన పీ రవికాంత్‌ అనే కం డక్టర్‌ తన కుమార్తెకు ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు వసూలు చేశాడంటూ అదే డిపోకు చెందిన డ్రైవర్‌ ఎల్‌.ప్రభాకరరావు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. కండక్టర్‌ పెనుమాక రవికాంత్‌ గతంలో ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఆర్టీసీ నుం చి తొలగించబడిన వైఎ్‌సఆర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అగ్రనేత వడ్డాన రవికుమార్‌కు అనుచరుడు. రవికుమార్‌ స్కామ్‌ నేపథ్యంలో అప్పట్లో పీ రవికాంత్‌పైనా ఆరోపణలు వచ్చా యి. ఆ తర్వాత ఈ వ్యవహారం నుంచి రవికాంత్‌ బయట పడ్డాడు. ఇప్పుడు సహోద్యోగి ప్రభాకరరావు ఆరోపణలతో వ్యవహారం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. టూటౌన్‌ పో లీసు స్టేషన్‌లో బాధితుడు ప్రభాకరరావు ఫి ర్యాదు చేయటంతో స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ పరువు, ప్రతిష్టలను మంటగలిపే విషయం కావటంతో ఆర్టీసీ విజిలెన్స్‌ అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడు ప్రభాకరరావుకు నోటీసు ఇచ్చి రెండు మూడు రోజుల్లో వివరణ  తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రవికాంత్‌ మాత్రం డబ్బులను వెన క్కిస్తానని పోలీసులను బతిమిలాడినట్టు తెలిసింది. దీంతో పోలీసులు రాజీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదులో పొందుపరిచిన అంశాల ను చూస్తే.. విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ప్రభాకరరా వు కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని రవికాం త్‌ నమ్మబలకడంతో తాను రూ.4లక్షలను బ్యాంకు ట్రాన్సాక్షన్‌ ద్వారానే చెల్లించానని ప్ర భాకరరావు వెల్లడించారు. తన ఎస్‌బీఐ ఖాతా నుంచి రవికాంత్‌ ఎస్‌బీ ఐ ఖాతాకు మొదటి దఫాగా జనవరి 24, 2019న రూ.లక్షన్నర, 2వ దఫా రూ.రెండున్నర లక్షలు అదే నెల చివర్లో చిట్టినగర్‌లో ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పించకపోవటంతో రెండేళ్లుగా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నానని, తర్వాత కొంచెం గట్టిగా ఒత్తిడి చేస్తే వడ్డీతో సహా తిరిగిస్తానని చెప్పాడని, కానీ ఈ రోజు వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ప్రభాకరరావు పేర్కొన్నాడు. తాను రవికాంత్‌కు బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసిన డబ్బులకు సంబంధించిన రశీదులను ఫిర్యాదుతో పాటు ప్రభాకరరావు పొందుపరిచారు. రవికాంత్‌ను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-17T06:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising