ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీచ్‌ హైస్కూల్‌లో ఉచిత ఐసోలేషన్‌ కేంద్రం

ABN, First Publish Date - 2021-05-16T06:36:08+05:30

ఉచిత ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌ అన్నారు. స్ధానిక రీచ్‌ హైస్కూల్‌లో గోపాలరావు ఠాకూర్‌ స్మారక సమితి ఆధ్వర్యంలో ఉచిత ఐసోలేషన్‌ కేంద్రాన్ని శనివారం సాయంత్రం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, మే 15 : ఉచిత ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు  అభినందనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌ అన్నారు. స్ధానిక రీచ్‌ హైస్కూల్‌లో గోపాలరావు ఠాకూర్‌ స్మారక సమితి ఆధ్వర్యంలో ఉచిత ఐసోలేషన్‌  కేంద్రాన్ని  శనివారం సాయంత్రం ప్రారంభించారు.  కొవిడ్‌ రోగులను ఆదుకోవటం గొప్ప విషయమన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు చిగురుపాటి కుమా ర స్వామి మాట్లాడుతూ 60 ఏళ్లలోపు ఉండి 1, 2 గదులలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న కొవిడ్‌ రోగుల కోసం ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పౌష్టిక ఆహారంతో పాటు ఆహ్లాదక రమైన వాతావరణం, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం టివి, ఆట పరికరాలను ఏర్పాటు చేశా మన్నారు. ఆక్సిజన్‌ లెవల్‌ 95 ఉన్న వారిని, ఎలాంటి ఇతర అనారోగ్య ఇబ్బందులు లేని వారిని చేర్పించుకుం టామన్నారు. కొవిడ్‌ రోగులతో పాటు వచ్చే సహాయకులకు ఉచిత వసతి, భోజనం కూడా  కల్పిస్తామన్నారు. రీచ్‌ విద్యా సంస్థల అధినేత మోటుపల్లి శామ్యూల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్‌, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ, పీకేఆర్‌ సేవా సంఘం చైర్మన్‌ కానూరు శేషమాధవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-16T06:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising