ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం : ఆర్డీవో

ABN, First Publish Date - 2021-07-27T06:26:22+05:30

స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం : ఆర్డీవో

స్పందనలో సమస్యలు వింటున్న ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు, జూలై 26: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం డివిజన్‌లోని పలు మండలాల ప్రజల నుంచి సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి, శాఖల అధికారులతో మాట్లాడారు. సీనియర్‌ సిటిజన్లు, అత్యవసర సమస్యలపై వచ్చే వారు డివిజన్‌ కేంద్రంలో దరఖాస్తులు అందించాలని, సాధారణ దరఖాస్తులకు మండల కేంద్రాల్లోనే ఆన్‌లైన్‌ రశీదు పొందాలన్నారు. నూజివీడు పట్టణం, మండలంలోని గొల్లపల్లి, పోలసానపల్లి, మర్రిబంధం, బాపులపాడు మండలంలోని మల్లవల్లి, గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆర్డీవోకు వివరించారు. డివిజన్‌ పరిధిలోని అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ చట్టప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఎంపీడీవో జి.రాణి, డివిజినల్‌ పరిపాలనాధికారి ఎం.హరనాథ్‌, పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.ఉమ పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-27T06:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising