ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: రెండో రోజు రేషన్ డీలర్ల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-27T21:19:02+05:30

రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజు కొనసాగుతోంది. గన్నీ బ్యాగుల అంశంతోపాటు పెండింగ్‌లో ఉన్న కమీషన్ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ హయాం నుంచే గన్నీ సంచులు డీలర్లకు ఇచ్చారని, అప్పటి నుంచి కమిషన్‌తో పాటు  గన్నీ బ్యాగులు డీలర్లు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పుడు బ్యాగుల కొరత పేరుతో ప్రభుత్వమే తీసుకుని ఒక్కో సంచికి 20 రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు. ఇప్పుడు అధికారులు గన్నీ బ్యాగులకు డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదంటున్నారని, దీని వల్ల డీలర్లు ఆర్ధికంగా మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే  రేషన్ షాపులు ఎలా నడపాలి.., కుటుంబాలను ఎలా  పోషించుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి ఎండీఎం, ఐసీడీఎస్ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-27T21:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising