రైల్వేకు దసరాలో రూ.కోటి ఆదాయం
ABN, First Publish Date - 2021-10-22T05:14:41+05:30
రైల్వేకు దసరాలో రూ.కోటి ఆదాయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెజవాడ రైల్వే డివిజన్‌కు దసరా ధమాకా తగిలింది. దసరా సీజన్‌లో నడిపిన ప్రత్యేక రైళ్లు, తనిఖీల ద్వారా దాదాపు రూ.కోటి ఆదాయం సమకూరింది. పండుగ సీజన్ అంటే.. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 16 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ఆపరేషన్ ద్వారా రూ.95.64 లక్షల ఆదాయం బెజవాడ రైల్వే డివిజన్‌కు సమకూరింది. ఈ రైళ్లతో పాటు సమాంతరంగా టికెట్ లేని ప్రయాణాలను నియంత్రించటం కోసం టికెట్ చెకింగ్ డ్రైవ్‌లను కూడా నిర్వహించారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిని భారీసంఖ్యలో గుర్తించారు. మొత్తం 14,568 మందిపై కేసులు నమోదు చేశారు.
Updated Date - 2021-10-22T05:14:41+05:30 IST