ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-10-20T06:33:39+05:30

పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, భాగం సాయిప్రసాద్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్బీపేట, అక్టోబరు 19: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసమర్థత, అనుభవరాహిత్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు భారీగా పెరిగాయని విద్యుత్‌ కోతలు మొదలు అయ్యాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. మంగళవారం 19వ డివిజన్‌ పున్నమ్మతోటలో విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి చార్జీలు పెంచకుండా చంద్రబాబు నాయుడు నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చారని చంద్రబాబు సీఎం అయ్యే నాటికి 4 గంటల విద్యుత్‌ కోత ఉండేదని అటువంటి పరిస్థితి నుంచి కేవలం 20 రోజుల్లో చంద్రబాబు నాయుడు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించారని అన్నారు. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలు పెంచడమే కాకుండా పల్లెల్లో కోతలు ప్రారంభమయ్యాయని, త్వరలో పట్టణాల్లోనూ మొదలవుతాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ట్రూ అప్‌ చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని సీఎం జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచొద్దని డిమాండ్‌ చేశారు. అనంతరం తన సొంత నిధులతో నిర్మించిన చప్టాను ప్రారంభించారు. డివిజన్‌ అధ్యక్షుడు భాగం సాయిప్రసాద్‌, ఎస్‌.ఫిరోజ్‌, ఎస్‌.ప్రభాకర్‌, మధుసూదన్‌ రావు, విజయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising