ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా నాయకుడు నాంచారయ్య మృతి

ABN, First Publish Date - 2021-01-14T12:55:30+05:30

పేద ప్రజల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వత్సవాయి(కృష్ణా): పేద ప్రజల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన సీపీఎం నాయకుడు గంటా నాంచారయ్య (75) మక్కపేటలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత తొలి మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడిగా పని చేశారు. అణగారిన ప్రజల కోసం ఉద్యమాలు చేసి జైలు జీవితం కూడా గడిపారు. నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడిగా, సీపీఎం కార్యదర్శిగా పని చేశారు. ఆర్‌ఎంపీ, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, జగ్గయ్యపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్‌, సీపీఎం జిల్లా నాయకులు డీవీ కృష్ణ, చిరుమామిళ్ల హనుమంతరావు, సోమోజు నాగమణి, నెల్లూరి మాధవరావు, ఎస్సీ సెల్‌ నాయకుడు వేల్పుల రవికుమార్‌, బీజేపీ రనాయకుడు మన్నె శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు బ్రహ్మం, జిల్లా గ్రామీణ వైద్యుల సంఘ అధ్యక్షుడు భూపాలరావు నివాళులర్పించారు. 


Updated Date - 2021-01-14T12:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising