ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలి: పీడీఎస్‌యూ

ABN, First Publish Date - 2021-11-29T06:35:25+05:30

ఇంటర్‌ విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలి: పీడీఎస్‌యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌పేట, నవంబరు 28: ఇంటర్‌ విద్యార్థి హరిబాబు ఆత్మహత్యపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ ప్రతినిధులు ఆదివారం ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి చదువుతున్న కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హాస్టల్‌ నిర్వ హిస్తోందని, హాస్టల్‌లో ఉండి చదువు కుంటున్న అనంతపురం జిల్లాకు చెందిన హరిబాబు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోందని వారు అన్నారు. యాజమాన్యాలకు ఫీజులు, ర్యాంకులపై ఉన్న శ్రద్ధను  విద్యార్థుల మానసిక స్థితిపై పెట్టకుండా రాత్రిపగలు తేడా లేకుండా క్లాసులు నిర్వహిస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రైవేట్‌ వసతి గృహాల్లో విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందని, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల బల వన్మరణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థి మృతికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆర్‌ఐవోను కలిసిన వారిలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, నగర అధ్యక్షుడు రాజేష్‌, సందీప్‌ ఉన్నారు.

Updated Date - 2021-11-29T06:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising