ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం బకాయిలు రూ.200 కోట్లపైనే!

ABN, First Publish Date - 2021-07-24T06:36:27+05:30

ధాన్యం బకాయిలు సకాలంలో అందక జిల్లా రైతులు ఇక్కట్లపాలవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూన్‌ 8 నుంచి నగదు విడుదల చేయని వైనం 

25వ తేదీతో రబీ ధాన్యం కొనుగోళ్లు నిలిపివేత

ఆంరఽధజ్యోతి- మచిలీపట్నం : ఽ

ధాన్యం బకాయిలు సకాలంలో అందక జిల్లా రైతులు ఇక్కట్లపాలవుతున్నారు. మే 28వ తేదీ నుంచి ధాన్యం బకాయిలు నిలిపివేయడంతో రైతులు తాము విక్రయించిన ధాన్యానికి నగదు ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బకాయిలపై రైతులు ఆందోళన చేస్తుండటంతో రెండు రోజులక్రితం రైతుల ఖాతాల్లో రూ.120 కోట్లు జమ చేశారు. జిల్లాకు ఇంకా రూ.200కోట్లకుపైగా నగదు రైతులకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంది.  ఒకపక్క లక్ష టన్నులకుపైగా ధాన్యం జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటే... ఈనెల 25వ తేదీతో రబీ ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు జేసీ  మాధవీలత ప్రకటించడం రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

 ఖరీఫ్‌ పెట్టబడి లేక ఇక్కట్లు 

   2021 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. రబీ ధాన్యం విక్రయించిన నగదు చేతికి రాకపోవడంతో ఖరీఫ్‌ సాగు పెట్టుబడికి రైతుల చేతిలో చిల్లిగవ్వ కూడా లేక సతమతమవుతున్నారు. ఒకటీ రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో నగదు చెల్లింపులు మరో రెండు రోజులు ఆలస్యమవుతాయి.  

 సోమవారం నాటికి జమ చేస్తాం

 జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఇటీవల రూ.120 కోట్లు జమచేశాం. సోమవారం నాటికి రూ. 200 కోట్లు జమచే సేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- రాజ్యలక్ష్మి, 

పౌరసరఫరాలశాఖ జిలా ్లమేనేజరు



Updated Date - 2021-07-24T06:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising