ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2021-04-13T05:54:55+05:30

విద్యార్థులు తమలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మలేషియా లింకన్‌ విశ్వవిద్యాలయం బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్‌ దీపానుజన్‌ బిశ్వాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: విద్యార్థులు తమలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మలేషియా లింకన్‌ విశ్వవిద్యాలయం బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్‌ దీపానుజన్‌ బిశ్వాస్‌ అన్నారు. కొత్తపేటలోని కేబీఎన్‌ పీజీ కళాశాల మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘సందర్భ పరిశీలన పద్ధతి’ అంశంపై ఆన్‌లైన్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దీపానుజన్‌ బిశ్వాస్‌ మాట్లాడుతూ అధ్యయనం చేసే అంశాలపై విద్యార్థులు, అధ్యయన శీలురులు నిర్ధిష్టమైన విధానాలను అనుసరించాలన్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటంతో పాటుగా విశ్లేషణ పద్ధతులపై శాస్త్రీయ విధానాలను పాటించాలన్నారు. సదస్సును ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ మాట్లాడుతూ విద్యా రంగంతో పాటుగా బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో అనేక నూతన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పీజీ స్టడీస్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేష్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ మజరున్నీసా, అధ్యాపకులు బి.ప్రభాకర్‌, డి.యశశ్వీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising