ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన టీచరుకు అధికారుల నోటీసులు!

ABN, First Publish Date - 2021-02-28T07:24:24+05:30

ఎన్నికల విధుల్లో ఎందుకు పాల్గొనలేదో తెలపాలంటూ చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఎందుకు పాల్గొనలేదో తెలపాలంటూ చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. విజయవాడ వన్‌టౌన్‌లోని గాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో వి.సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనను పంచాయతీ ఎన్నికల్లో నూజివీడు డివిజన్‌ రెడ్డిగూడెం మండలంలో ఎన్నికల విధుల్లో నియమించారు. ఆయన ఇటీవలే మరణించడంతో ఎన్నికల విధులకు హాజరుకాలేదు. అయితే ఎన్నికల విధులకు గైర్హాజరయిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేరున ఈనెల 23న  షోకాజ్‌  నోటీసు జారీ అయ్యింది. ఈ ఘటనపై డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మిని వివరణ కోరగా సమాచార లోపం కారణంగా నోటీసు జారీ అయి ఉండవచ్చని చెప్పారు.

Updated Date - 2021-02-28T07:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising